'అది చిన్న‌గా ఉంది.. ఈ అబ్బాయి నాకు వ‌ద్దు..' పెళ్లి క్యాన్సిల్ చేసిన వ‌ధువు

Bride Cancel marriage as Groom nose is Small.వ‌రుడి ముక్కు చిన్న‌గా ఉండ‌డంతో పెళ్లి చేసుకోను అని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2022 4:07 AM GMT
అది చిన్న‌గా ఉంది.. ఈ అబ్బాయి నాకు వ‌ద్దు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వ‌ధువు

సాధార‌ణంగా పెళ్లి కొడుకు పొట్టిగా ఉన్నాడ‌నో, లావుగా ఉన్నాడ‌నో, పొట్ట ఉంద‌నో, బ‌ట్ట‌త‌ల ఉందనో, చెడు అల‌వాట్లు ఉన్నాయ‌నే కార‌ణంగా పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చిన పెళ్లిళ్లు ఆగిపోయిన ఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా ఓ వధువు వ‌రుడిని పెళ్లి చేసుకునేదే లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. అందుకు ఆమె చెప్పిన కార‌ణం మాత్రం చాలా వింత‌గా ఉంది. వ‌రుడి ముక్కు చిన్న‌గా ఉండ‌డంతో పెళ్లి చేసుకోను అని చెప్పింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సంభాల్ జిల్లాలో ఓ యువ‌తికి, ఓ యువ‌కుడికి పెళ్లి నిశ్చ‌యించారు. పెళ్లి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో బుధ‌వారం వ‌రుడి కుటుంబం ఊరేగింపుగా వ‌ధువు ఇంటికి వెళ్లారు. అక్క‌డి పెళ్లి సంద‌డి మొద‌లైంది. అయితే.. అక్క‌డ ఉన్న మ‌హిళ‌లు వ‌రుడి గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. వ‌రుడి ముక్కు చాలా చిన్న‌గా ఉంద‌ని వారు మాట్లాడుకుంటున్న మాట‌లు వ‌ధువు చెవిన ప‌డ్డాయి.

అది విన్న వ‌ధువు వెంట‌నే అత‌డిని చూసేందుకు వెళ్లింది. ఆ త‌రువాత ఈ పెళ్లి నాకు వ‌ద్ద‌ని చెప్పింది. ఏమి జ‌రిగింద‌ని ఆమెను అడుగ‌గా.. పెళ్లి కొడుకు ముక్కు చిన్న‌గా ఉంద‌ని చెప్పింది. ఆమెకు న‌చ్చ‌జెప్పేందుకు అక్క‌డ ఉన్న‌వారంద‌రూ ప్ర‌య‌త్నించినా లాభం లేక‌పోయింది. దీంతో వ‌రుడి కుటుంబం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ప్ర‌స్తుతం ఈ వార్త నెటింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story