వీడి ధైర్యం త‌గ‌లేయా.. పామును ప‌ట్టుకుని లుంగిలో వేసుకున్నాడు

Brave man catches snake puts it his lungi. ఓ వ్య‌క్తి మాత్రం ఆరు అడుగులు ఉన్న పామును అదేదో ఆట వ‌స్తువు అన్న‌ట్లుగా ప‌ట్టుకుని ఎంచ‌క్కా త‌ను క‌ట్టుకున్న లుంగిలో వేసుకుని వెళ్లిపోయాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 8:35 AM GMT
snake in lungi

చాలా మందికి పాములంటే భ‌యం ఉంటుంది. వాటిని చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అదే ఆరు అడుగులు ఉన్న పాము మ‌న ఎదురుగా వ‌స్తే.. ఇంకేముంది భ‌యంతో ఒళ్లు త‌డ‌వ‌డం ఖాయం. అయితే.. ఓ వ్య‌క్తి మాత్రం ఆరు అడుగులు ఉన్న పామును అదేదో ఆట వ‌స్తువు అన్న‌ట్లుగా ప‌ట్టుకుని ఎంచ‌క్కా త‌ను క‌ట్టుకున్న లుంగిలో వేసుకుని వెళ్లిపోయాడు. అత‌ను క‌నీసం లుంగినీ కూడా విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే.. ఇది ఇప్ప‌టి వీడియో కాదు.. కొన్నాళ్ల క్రితం ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత్‌ నంద తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'లుంగీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు' అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో మరోసారి వార్తలోకెక్కింది. తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ సారి చూసేయండి. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. వామ్మో వీడి ధైర్యం త‌గ‌లేయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story