హెల్మెట్ ధరించే వారికి దేవుడు సాయం చేస్తాడు.. వీడియో చూడాల్సిందే

Biker Saved By His Helmet Twice In A Matter Of Seconds. ఓ వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించ‌డంతో సెక‌న్ల తేడాతో రెండు ప్రమాదాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2022 6:28 AM GMT
హెల్మెట్ ధరించే వారికి దేవుడు సాయం చేస్తాడు.. వీడియో చూడాల్సిందే

బైక్‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాల‌ని ఎంత చెబుతున్న‌ప్ప‌టికీ కొంద‌రిలో ఇంకా మార్పు రావ‌డం లేదు. అనుకోని ప్ర‌మాదాల భారీన ప‌డిన‌ప్పుడు హెల్మెట్లు ప్రాణాలు కాపాడుతాయ‌ని కొన్ని ఘ‌ట‌న‌లో మ‌నం చూశాం. ఓ వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించ‌డంతో సెక‌న్ల తేడాతో రెండు ప్రమాదాల నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. దీనిని ఢీల్లీ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "హెల్మెట్ పెట్టుకుంటే వారిని ఆ దేవుడే ర‌క్షిస్తాడు" అని క్యాప్ష‌న్ కూడా పెట్టారు. ఇంత‌కు ఆ వీడియోలో ఏముందంటే.. రోడ్డు మీద బైక్‌పై వేగంగా వెలుతున్న వ్య‌క్తి కారును త‌ప్పించ‌బోయి ప‌క్క‌నే ఉన్న వీధి దీప స్తంబాన్ని డీ కొట్టి కింద‌ప‌డ్డాడు. హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల అత‌డి త‌ల‌కు ఎలాంటి దెబ్బ త‌గ‌ల లేదు. హ‌మ్మ‌య్య అని లేచే లోపే ఆ దీప విద్యుత్ స్తంభం కాస్త అత‌డి త‌ల‌పై ప‌డింది. అయితే.. హెల్మెట్ ఉండ‌డం వ‌ల్ల అదృష్ట వ‌శాత్తు అత‌డి ప్రాణాలతో బ‌య‌ప‌డ్డాడు.

ఈ వీడియో చూస్తే న‌వ్వు ఖాయం. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు లైకులు, షేర్లు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

Next Story