ఒక్క‌రోజే చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Bengali couple surprised by creating a food menu in the form of Aadhaar Card.పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండి పోతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2021 9:01 PM IST
ఒక్క‌రోజే చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండి పోతుంది. అలాంటి వేడుకలో కొత్త‌ద‌న్నాన్ని చూపించేందుకు ఉత్సాహాం చూపుతున్నారు. ఎవ‌రి ఐడియాలు వాళ్ల‌వి. పెళ్లిచేసుకోవాల‌ని అనుకున్న ఓ బెంగాలీ జంట‌కు ఓ స‌రికొత్త ఆలోచ‌న వ‌చ్చింది. తమ వివాహానికి హాజరయ్యే అతిథులకు వడ్డించే ఆహార పదార్థాల జాబితాను ఆధార్ కార్డ్ నమూనాలో ముద్రించారు. ఆపెళ్లిలో ఇది ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌డంతో పాటు అది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కోల్‌కతాలోని రాజర్హాట్ ప్రాంత వాసులు గొగోల్ సాహా, సుబర్న దాస్ వివాహం ఫిబ్రవరి 1న జరిగింది. త‌మ ప్ర‌త్యేక‌ను చాటుకోవాల‌ని భావించిన ఆ జంట.. వెడ్డింగ్ పుడ్ మెనూ కార్డ్‌ను ఆధార్ న‌మూనాలో త‌యారు చేశారు. ఓ వైపు వడ్డించే వంటకాల వివరాలతో పాటు మరోవైపు ఈ ఒక్క రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుందంటూ ముద్రించారు. మెనూ కార్డ్‌ను ఆసక్తిగా గమనించిన ఓ అతిథి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది ప్ర‌స్తుతం అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై న‌వ‌దంప‌తులు చాలా ఆనందం వ్య‌క్తం చేశారు. తామిద్దరం డిజిటల్ ఇండియాను సమర్థిస్తామన్నారు.

పెళ్లి కొడుకు సాహా మాట్లాడుతూ.. తన భార్య సుబర్నకు వచ్చిన ఆలోచన మేరకు తమ వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డ్‌ను ఆధార్ కార్డు నమూనాలో ప్రింట్ చేయించామని తెలిపారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా ఇంత కన్నా ఏం చేయగలమని, అందుకే ఈ విధంగా ప్రింట్ చేయించామని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ ఒక్క‌రోజు ఆధార్ కార్డు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.




Next Story