వ‌రుడు కావ‌లెను అంటూ 73ఏళ్ల వృద్దురాలు ప్ర‌క‌ట‌న‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

At 73 Retired Karnataka teacher places ad for life partner.ఓ బామ్మ‌గారు ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం సోషల్ మీ డియాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2021 3:09 PM GMT
వ‌రుడు కావ‌లెను అంటూ 73ఏళ్ల వృద్దురాలు ప్ర‌క‌ట‌న‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఓ బామ్మ‌గారు ఇచ్చిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కు ఆమె ఏం ప్ర‌క‌ట‌న ఇచ్చింద‌ని అంటారా..? 73 ఏళ్ల‌కు వ‌య‌సులో ఆమె త‌న‌కు ఓ తోడు కావాలంటూ ఇచ్చిన ప్ర‌క‌ట‌న ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. క‌ర్ణాట‌క‌లోని మైసూరుకు చెందిన ఆమె ఓ రిటైర్డ్ టీచ‌ర్‌. ఆమెకు గతంలో వివాహం జరిగినా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు పిల్లలు కూడా లేరు. తల్లిదండ్రులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఒంటరిగా జీవిస్తోంది.

జీవితం చివ‌రి ద‌శ‌లో ఉండ‌డంతో ఓ తోడు అవ‌స‌రం ఉంద‌ని బావించింది. తాను బ్ర‌హ్మ‌ణ స్త్రీ కాబ‌ట్టి.. వరుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడై ఉండాలని, తనకంటే వయసులో పెద్దవాడై ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఆమెను మీడియా ప్ర‌శ్నించ‌గా.. "నాకు సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు లేరు. నా తొలి వివాహం విడాకులతో ముగిసింది. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారు ఉండరనే ఆలోచన వస్తోంది. బస్టాప్ నుంచి ఇంటికి నడవాలంటే భయమేస్తోంది. ఇలాంటి ఆలోచనలు జీవిత భాగస్వామి కోసం చూసేలా చేస్తున్నాయి "అని ఆ వృద్దురాలు పేర్కొంది.

కాగా.. ఆ వృద్ధురాలి నిర్ణయాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతిస్తున్నారు. జీవితానికి విలువ ఇస్తూ.. వయసు గురించి పట్టించుకోకుండా వివాహం కోసం ప్రకటన హర్షించదగ్గ పరిణామం అని పేర్కొంటున్నారు. మోస‌గాళ్లు ఉంటార‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు కొంద‌రు.


Next Story