భర్తతో పాటు అనుకోకుండా మామతో పెళ్లి.. అసలు ట్విస్ట్ ఇదే

తరచుగా కొన్ని పెళ్లిలు వింత వింత కారణాలతో ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ పెళ్లి కూడా.

By అంజి  Published on  20 July 2023 8:00 AM GMT
Wedding Blunder, Viral news, Australia, radio show

భర్తతో పాటు అనుకోకుండా మామతో పెళ్లి.. అసలు ట్విస్ట్ ఇదే

తరచుగా కొన్ని పెళ్లిలు వింత వింత కారణాలతో ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ పెళ్లి కూడా. ఓ మహిళ పెళ్లిలో ఊహించని ట్విస్ట్‌ చేసుకుంది. ఆ మహిళ తన భర్తతో పాటు అనుకోకుండా తన మామను కూడా పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్‌ పాపులర్‌ రేడియో షో ఫిట్జీ అండ్‌ విప్పా విత్‌ కేట్‌ రిచీలో ఓ మహిళ తన పెళ్లిలో జరిగిన అతి పెద్ద పొరపాటును బయట పెట్టింది. పెళ్లిలో తన భర్త సంతకం చేయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టారని, దీంతో మామగారితోనే వివాహం అయినట్టు అధికారులు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఇచ్చారన చెప్పింది. ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలు ఉన్నారని తెలిపింది. ఇది విని రేడియో శ్రోతలు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ ప్రోగ్రామ్‌లో.. ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన అతి పెద్ద పొరపాట్ల గురించి చెప్పమని హోస్ట్‌ అడిగారు. ఈ క్రమంలోనే కిమ్ అనే ఒక మహిళ తన వివాహంలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పింది. తన పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి తన మామ, అత్త వచ్చారని, సరిగ్గా పెళ్లి సమయానికి తన అత్త, మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని తన భర్తను కోరారని చెప్పింది. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారని, తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట తన సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం తన భర్తతో పాటు తన మామ పేరు కూడా ఉందన్నారు. ఆ సర్టిఫికెట్‌ని ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని సదరు మహిళ తెలిపింది.

Next Story