62 ఏళ్ల బామ్మ డ్యాన్స్ అదుర్స్

62 Years old Ravi Bala Koi Ladki Hai song dance Video viral.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా యుగం న‌డుస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 12:12 PM IST
62 ఏళ్ల బామ్మ డ్యాన్స్ అదుర్స్

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా యుగం న‌డుస్తోంది. ఈ కాలంలో ఎవ‌రు ఎప్పుడు ఎందుకు సెల‌బ్రెటీలుగా మారుతున్నారో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఒక్క వీడియోతో ఓవ‌ర్ నైట్‌లో స్టార్‌గా మారుతున్నారు. కొన్ని వీడియోలు ఆహ్లాదాన్ని క‌లిగించేవి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ బామ్మ 62 ఏళ్ల వ‌య‌సులో ఓ బాలీవుడ్ పాట‌కు వేసిన డ్యాన్స్ నెటీజ‌న్లు తెగ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం బామ్మ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ గా మారింది. బామ్మ వేసిన సెప్టుల‌కు ఫిదా కావాల్సిందే.

అలనాటి బాలీవుడ్ హీరోయిన్ల‌లో మాధురీ దీక్షిత్ ఒక‌రు. అందంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. కాళ్ల‌తోనే కాదు క‌ళ్ల‌తోనూ అభిన‌యాలు ప‌లికిస్తూ ఉంటుంది. ఇక మాధురి దీక్షిత్ చేసిన పాట‌ల్లో ఎప్ప‌టికి నెంబ‌ర్ స్థానంలో నిలిచే పాట 'ఏక్ దో తీన్' పాట‌నే. ఈ సాంగ్‌లోని రిథమ్, మాధురి లుక్స్, స్టెప్ప్ ఇవన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే అని చెప్పొచ్చు.

అలానే ఆమె హిట్స్ సాంగ్స్‌లో దిల్‌ తో పాగల్‌ హై సినిమాలోని 'కోయి లడ్కి హై' ఒక‌టి. కాగా.. ఈ పాట‌కు 62 ఏళ్ల ర‌వి బాల శ‌ర్మ అనే బామ్మ వేసిన డ్యాన్స్ ఆక‌ట్టుకుంటోంది. గులాబీ రంగు కుర్తా, తెలుపు ప‌లాజో ధ‌రించి రెండు పిల‌క‌లు వేసుకుని.. ఈమె చేసిన డ్యాన్స్ మాధురీ దీక్షిత్‌ను గుర్తుకుతెచ్చింది. కాగా.. ఈ వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికి మ‌రోసారి ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి బామ్మ వేసిన స్టెప్పుల‌ను చూసేయండి.

Next Story