విచిత్ర ప్రేమకథ.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న జంట.. విగ్రహాలకు వివాహం

6 months after lovers die by suicide, families get their statues married. గుజరాత్‌లో ఓ విచిత్రమైన ప్రేమ కథ తెరపైకి వచ్చింది. ఆరు నెలలకు ముందు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను

By M.S.R  Published on  18 Jan 2023 5:45 PM IST
విచిత్ర ప్రేమకథ.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న జంట.. విగ్రహాలకు వివాహం

గుజరాత్‌లో ఓ విచిత్రమైన ప్రేమ కథ తెరపైకి వచ్చింది. ఆరు నెలలకు ముందు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న జంట విగ్రహాలకు వివాహం చేశారు. కుటుంబ సభ్యులు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆశలు వదులుకున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆగస్టు 2022లో, గుజరాత్‌లోని తాపిలో గణేష్, రంజనలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ సంఘటన తర్వాత, వారి కుటుంబాలు ఎంతో బాధపడ్డాయి. గణేష్, రంజన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని.. ఎలాగూ వాళ్లు బతికున్నప్పుడు పెళ్లి చేయలేకపోయాము.. ఇప్పుడైనా పెళ్లి చేస్తే మంచిదని భావించారు. జీవించి ఉన్నప్పుడు వారిద్దరినీ ఒక్కటి చేయలేకపోయామనే పశ్చాత్తాపంతో వారు గణేష్, రంజన విగ్రహాలను తయారు చేయించారు. ఆచారాలను అనుసరించి గణేష్, రంజన ప్రతిమలకు వివాహం చేశారు.

గణేష్, రంజనకు దూరపు చుట్టం కూడా అవుతాడు. కానీ కొన్ని కారణాల వలన పెళ్లి చేయలేకపోయామని అమ్మాయి తాత భీంసింగ్ పద్వీ తెలిపారు. అయితే వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఇరు కుటుంబాలు కలిసి.. వారి చివరి కోరిక తీర్చేందుకు, వారి ఆత్మకు శాంతి కలగాలని పెళ్లి చేశామని కుటుంబీకులు తెలిపారు.


Next Story