స్టూడెంట్‌ను ప్రేమించి పెళ్లాడిన టీచర్.. అతడికి 42, ఆమెకు 22
42 Year old teacher ties knot with his 20 year old student. 20 ఏళ్ల వయస్సు వ్యత్సాసం ఉన్న ఓ టీచర్, స్టూడెంట్
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2022 11:59 AM ISTప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రేమకు వయస్సు, మతం, ప్రాంతం, ధనిక, పేద తేడా ఉండదు. ఈ మధ్య లింగ భేదం కూడా ఉండడం లేదు అది వేరే విషయం అనుకోండి . ఇటీవల విన్నూత ప్రేమ కథలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ప్రేమ కథే ఇది. 20 ఏళ్ల వయస్సు వ్యత్సాసం ఉన్న ఓ టీచర్, స్టూడెంట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన బిహార్ లో జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సమస్తిపూర్‌లో 42 ఏళ్ల ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు టీచర్‌గా ఓ కోచింగ్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 22 ఏళ్ల ఓ విద్యార్థిని ఆ కోచింగ్ సెంటర్‌కు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మనసులు కలిశాయి. జీవితాంతం ఇద్దరూ కలిసి జీవించాలని బావించారు. పెళ్లి చేసుకోవాలని అనుకోని ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లోని వారికి చెప్పగా వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో వీరిద్దరు తాజాగా ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆ కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులు హాజరు అయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. సదరు మాస్టర్ మొదటి భార్య చాలా ఏళ్ల క్రితమే మరణించింది. అయితే.. రెండో పెళ్లి చేసుకునేందుకు అతను ఆసక్తి చూపించలేదు. అయితే.. ఎప్పుడైతే ఈ విద్యార్థిని కోచింగ్ సెంటర్‌లో అడుగుపెట్టిందో ఆమెపై ప్రేమ మొదలైనట్లు చెప్పాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించడంతో పెళ్లితో ఒక్కటి అయినట్లు తెలిపాడు.