తగ్గేదేలే.. 56 ఏళ్ల బామ్మతో 19 ఏళ్ల యువకుడి ప్రేమ.. రెండేళ్లుగా సహజీవనం
19 Year Old Thailand Boy Gets Engaged to 56 Year Old Woman.అబ్బాయికి 19 కాగా.. ఆమెకు 56 ఏళ్లు. అయితేనేం..ప్రేమలో మునిగి
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2022 12:08 PM ISTప్రేమ.. రెండు అక్షరాల పదం. ఎప్పుడు ఎవరి మధ్యన ఎందుకు ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రేమ గుడ్డిదని, దానికి దూరం, వయస్సుతో సంబంధం లేదని చెబుతుంటారు. వీళ్లను చూస్తే ఇది నిజం అనిపించక మానదు. వీరిద్దరికి వయస్సులో 37 సంవత్సరాల తేడా ఉంది. అబ్బాయికి 19 కాగా.. ఆమెకు 56 ఏళ్లు. అయితేనేం.. ప్రేమలో మునిగి తేలుతున్నామని అంటున్నారు. అంతేనా నిశ్చితార్థం చేసుకున్నామని త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నమని చెబుతున్నారు. థాయ్‌లాండ్ కు చెందిన ఈ జంట ప్రేమ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉతిచాయ్ చంత్రాజ్ అనే 19 ఏళ్ల యువకుడు ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ రాష్ట్రంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి పక్కనే 56 ఏళ్ల జన్లా నమువాన్‌గ్రాక్ అనే మహిళను నివసిస్తోంది. ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయాలని జన్లా.. అప్పుడప్పుడు ఉతిచాయ్ చంత్రాజ్ కోరేది. అతడు ఆమెకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తరువాత అది ప్రేమగా చిగురించింది. 37 సంవత్సరాల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా వీరు సహజీవనం చేస్తున్నారు. ఉతిచాయ్ తనకు 9 ఏళ్ల వయసు నుంచే జన్లాను ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
"గత రెండు సంవత్సరాలుగా జన్లాతో ఉంటున్నా. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చునని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశా. ఆతరువాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించా. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి. నిజాయితీగా ఉంటుంది. అందుకనే నేను ఆమెను ఆరాధిస్తాను" అని ఉతిచాయ్ చంత్రాజ్ చెప్పాడు.
వయస్సు తేడా పట్ల వారిద్దరూ ఎలాంటి ఆందోళన చెందడం లేదు. ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. బహిరంగంగా తమ బంధాన్ని చెప్పడంలో ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు. బయట తిరిగేటప్పుడు ఒకరి చేతుల్లో మరొకరు చేయి వేసుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు.
జన్లా.. భర్తతో విడిపోయింది. ఆమెకు 30 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చిన్న వయసులో అంత పెద్ద ప్రేమ అని అంటున్నారు. యువకుడు బామ్మను పెళ్లి చేసుకోవడం ఓ వింతగానే భావిస్తున్నారు.