ఆడ తోడు, అనువైన ప్రదేశం కోసం ఆరు జిల్లాలు తిరిగిన పెద్దపులి..!

By అంజి  Published on  2 Dec 2019 4:45 AM GMT
ఆడ తోడు, అనువైన ప్రదేశం కోసం ఆరు జిల్లాలు తిరిగిన పెద్దపులి..!

మన ఇంట్లో పెళ్లి కావలసిన అబ్బాయి ఉన్నాడు అంటే వెంటనే సంబంధాలు చూడటం మొదలు పెడతాం. కొంచెం దూరం వెళ్ళినా సరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటాం. కానీ జంతువులకి అలాంటి ఆప్షన్ లేదు. వాటికి తల్లిదండ్రులు సంబంధాల చూడక్కర్లేదు, అన్ని లవ్ మ్యారేజి లే. అందుకే తన తోడు కోసం ఒక మగ పులి ఏకంగా 150 రోజులపాటు 13 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. మహారాష్ట్ర తెలంగాణలోని ఆరు జిల్లాల గుండా దీని ప్రయాణం సాగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చివరకు బుల్ఢానా జిల్లా లోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరి అక్కడ తన ప్రయాణాన్ని ఆపింది.. ఇంతకీ ఆ పులి జర్నీ ఎలా సాగిందంటే..

Img 20191202 094422

2016లో తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించాయి. వాటికి అధికారులు సి 1, సి 2, సి 3 అని పేరు పెట్టారు. ఇవి మూడేళ్లకు వయసుకు వచ్చాయని ఫీలయ్యాయి. ఆడ తోడుతో పాటు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ మగ పులులైన సి 1, సి 3లు బయలుదేరాయి. వాటి ఫీలింగ్ అర్థం చేసుకున్న అధికారులు వాటి కదలికలు కూడా అర్థం చేసుకునేందుకు వీడియో కాలర్లు అమర్చారు. ఎందుకంటే కిషోర్రప్రాయంలోకి వచ్చిన పులులు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకుంటాయి. అందుకోసం అనువైన స్థానాన్ని గుర్తించేందుకు గాలింపు చేపడతాయి. గత జూన్‌లో తిప్పేస్వామి దాటిన ఇవి పంధార్ కవాడా డివిజన్ మీదుగా తెలంగాణకు చేరాయి. సి 3 అనే పెద్దపులి ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకు వచ్చింది. ఇక సి 1 అనే పులి అంబాడీ ఘాట్, కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్కు వచ్చింది. మొత్తానికి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య అంతరాష్ట్ర అడవులలో ఎన్నో రోజులు గడిపిన ఈ పులి ఇప్పుడు ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకుంది. వందలాది గ్రామాలు దాటిన ఇది ఎక్కడ మానవుల పై దాడికి దిగలేదని, ఆకలి వేసినప్పుడు పశువుల పైన మాత్రమే దాడులు చేసిందని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రదేశం అయితే దొరికింది. ఇంకా కొత్త తోడు కూడా ఈ పులికి దొరకాలని మనము కోరుకుందాం.

Img 20191202 094427

Next Story