దెబ్బకు ఠా.. కోతుల ముఠా..!
By అంజి Published on 3 Dec 2019 10:39 AM ISTపులిని చూసి నక్క వాత పెట్టుకున్నదన్న మాట గుర్తుందా. ఇక్కడ నక్క కాదు.. కుక్క.. వాత పెట్టుకోలేదు కానీ దానికి వీలైనంతలో యజమానికి సహాయం చెయ్యటానికి రంగులు వేయించుకుంది. కర్ణాటకలో శ్రీకాంత గౌడ అనే రైతు కోతుల బారి నుంచి తన పంటను రక్షించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. సరిగా నాలుగేళ్ల క్రితం కోతులు తోటను పాడు చేస్తుండటంతో వాటిని భయపెట్టడానికి అక్కడ ఓ పులి బొమ్మను పెట్టాడు. కోతులు రావడం మానేశాయి. తర్వాత మరో పోలం లోనూ ఇలాగే చేశాడు. అక్కడికీ కోతులు రావటం ఆపేసాయి. ఇప్పుడు ఇంకాస్తా అడ్వాన్స్ అయ్యాడు. తన పెంపుడు కుక్కనే పులిగా మార్చేశాడు. ఎంతైనా ప్రియమైన కుక్క కదా రంగులు వేస్తే చర్మం పాడవుతుందని హెయిర్ డై వేసి పులి కలరింగ్ ఇచ్చాడు. దెబ్బకు కోతులు తమ పొలాల దరిదాపుల్లోకే రావట్లేదాని చెబుతున్నాడు ఆ రైతు.
Next Story