అత్యాచారం విషయంలో హైకోర్టు సంచలన తీర్పు

By సుభాష్  Published on  25 May 2020 3:42 PM IST
అత్యాచారం విషయంలో హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచారం విషయంలో ఒడిషా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అన్ని సన్నిహిత సంబంధాల విషయాల్లో అత్యాచార చట్టాలను ఉపయోగించలేమని, అందులోనూ మహిళ అంగీకారంతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అత్యాచారంగా పరిగణించలేమని జస్టిస్‌ ఎస్కే పాణిగ్రహి అన్నారు.

కాగా, 19 ఏళ్ల బాలిక అత్యాచార ఘటన కేసులో ఒడిశా హైకోర్టులో ఈ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడైన అచ్యుత్‌కుమార్‌ అనే వ్యక్తికి బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అచ్యుత్‌ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఓ బాలిక గత సంవత్సరం నవంబర్‌ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనకు గర్బం రాకుండా బలవంతంగా మాత్రలు మింగించాడని ఫిర్యాదు పేర్కొంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

దీంతో నిందితుడు బెయిల్‌ కావాలంటూ కింది కోర్టును ఆశ్రయించగా, అతని బెయిల్‌ను కొట్టివేసింది. దీంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. నిందితుడికి మద్దతుగా తీర్పు ఇచ్చిస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అత్యాచారం విషయంలో కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.

Next Story