204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ద.మ. రైల్వే
By రాణి Published on 10 April 2020 5:12 PM GMTకరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో పనిచేసేందుకు గాను 204 తాత్కాలిక పోస్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ హాస్పిటల్, లాలాగూడ, సికింద్రాబాద్ లో ఉన్న ఆస్పత్రుల్లో పనిచేసేందుకు గాను 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, 34 మంది జీడీఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు, 7 గురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 ఆస్పత్రి అటెండెంట్ల పోస్టుల కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read : తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర..ఒక్కరోజే చెరో 16 కేసులు
ఆసక్తి కల అభ్యర్థులు www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్ లో ఈ నెల 15వ తారీఖు లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని ద.మ. రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే సంబంధిత పోస్టులకు కావాల్సిన విద్యార్హతలను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9701370624 ను సంప్రదించవచ్చని తెలిపారు. కాగా కరోనా రోగుల కోసం కొన్ని వందల రైళ్లను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చింది రైల్వేశాఖ. దేశంలో రోజురోజుకీ కరోనా రోగులు పెరుగుతుండటంతో వారికి వైద్యమందించేందుకు వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదముందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక కరోనా పేషెంట్ ను చూసుకునేందుకు ఒక డాక్టతో సహా సగటున నలుగురు సిబ్బంది అవసరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ తాత్కాలిక సిబ్బంది కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.