తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర..ఒక్కరోజే చెరో 16 కేసులు

By రాణి  Published on  10 April 2020 4:25 PM GMT
తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర..ఒక్కరోజే చెరో 16 కేసులు

తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర చేసింది. ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లో చెరో 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా నమోదైన 16 కేసులతో కరోనా కేసుల సంఖ్య 487కు చేరింది. వీరిలో 12 మంది మృతి చెందగా..45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 430 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

అటు ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 133 హాట్ స్పాట్లను గుర్తించి..ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాల్సిందిగా హెచ్చరించింది ప్రభుత్వం. నిత్యావసరాలను కూడా ఇళ్లకే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం మరో 16 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో అక్కడ కరోనా కేసుల సంఖ్య 381 కి చేరింది. వీరిలో 10 మంది కోలుకోగా..6 గురు మృతి చెందారు. ప్రస్తుతం 365 కేసులు యాక్టివ్ గా ఉండగా..వీరందరికీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6761కి పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకూ మృతుల సంఖ్య 199కి చేరగా..గడిచిన 24 గంటల్లో 23 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Also Read : ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్..ఆ యూజర్లకు మాత్రమే

Next Story