ఏపీలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

By సుభాష్  Published on  17 April 2020 9:20 AM GMT
ఏపీలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులలో 1,184 స్పెషలిస్టు వైద్యులు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌, ఎక్స్‌ ఫిషియా కార్యదర్శి, రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీసభ్యులు తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. 1184 పోస్టుల్లో 592 జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌ పోస్టులున్నాయని తెలిపారు. ఈ పోస్టులన్నీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎంపికైన వారు కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు పని చేసే విధంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, స్పెషలిస్టు వైద్యులకు రూ.లక్షా 10వేలు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లకు రూ. 53,945 వేతనం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హత గల ఆసక్తి, అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను dme.ap.nic.in కు అందించాలని కోరారు. మరిన్ని వివరాలకు dme.ap.nic.in వెబ్‌ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

1,184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

Next Story
Share it