ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
By సుభాష్ Published on 17 April 2020 12:20 PM ISTఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఏపీ ఆరోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 572 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇందులో 35 మందిని డిశ్చార్జ్ చేయగా, 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం 523 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించింది ఏపీ సర్కార్. దీంతో ప్రజలెవ్వరిని బయటకు రానివ్వకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. నిత్యావసరాలను సైతం వారి వద్దకే సరఫరా చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపడుతున్నారు.
ఇక శుక్రవారం వరకు అనంతపూర్‌లో 26, చిత్తూరులో 28, ఈస్ట్ గోదావరిలో 17, గుంటూరులో 126, రడపలో 37, కృష్ణాలో52, కర్నూలులో126, నెల్లూరులో64, ప్రకాశంలో 42, విశాఖలో 20, వెస్ట్ గోదావరి జిల్లాలో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.