యాక్ట‌ర్ రెడ్డి కాదు.. డైరెక్ట‌ర్ రెడ్డి..!

యాక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డికి టీటీడీ భ‌క్తి చాన‌ల్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి ఇచ్చారంటూ గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం మొద‌లైంది. అంతే… ఇంకేముంది శ్రీనివాస‌రెడ్డికి ఫోన్ చేసి మిత్రులు, బంధువులు అభినంద‌న‌లు తెలియ‌చేయ‌డం స్టార్ట్ చేసారు. టీటీడీ భ‌క్తి చాన‌ల్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కించుకున్న శ్రీనివాస‌రెడ్డి నేను కాదు నాయ‌నా… డైరెక్ట‌ర్ శ్రీనివాసరెడ్డి అని చెప్పాల్సివ‌చ్చింద‌ట‌. అయినా.. ఫోన్లు వ‌స్తూనే ఉండ‌డంతో ఇలా కాదు అని ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… శుభోదయం.. నేను కాదు “ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారు ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించబడ్డారు అని తెలియ‌చేసారు.

డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డికి ఈ ప‌ద‌వి రావ‌డానికి ఓ ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. చిన్న సినిమాల‌ను తెర‌కెక్కించే శ్రీనివాస‌రెడ్డి నాగార్జున‌తో ‘ఢ‌మ‌రుకం’ సినిమాని తెర‌కెక్కించి మంచి పేరు సంపాదించారు. ప్ర‌స్తుతం ‘రాగ‌ల 24 గంట‌ల్లో’ అనే సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల టైమ్ లో పార్టీ ప్ర‌క‌ట‌న‌ల రూప‌క‌ల్ప‌న‌లో త‌న వంతు పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. ఆ విధంగా పార్టీకి స‌హ‌క‌రించినందుకు గాను జ‌గ‌న్ ఈ ప‌ద‌వి ఇచ్చిన‌ట్టు తెలిసింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.