ఉత్తరకొరియాలో ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదేమో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 9:59 AM GMT
ఉత్తరకొరియాలో ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదేమో..!

ఉత్తర కొరియా అంటేనే కఠినమైన శిక్షలు గుర్తొస్తాయి. చిన్న చిన్న తప్పులకు కూడా అక్కడ పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తారు ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారులు, సైన్యం. వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా ? ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ను చూసుకునే వీళ్లకి ఇంత ధైర్యం. ఎంత ఘోరం కాాకపోతే కరోనా విజృంభిస్తోన్న తొలిరోజుల్లో ఉత్తరకొరియాలో నమోదైన మొదటి కరోనా పాజిటివ్ కేసు వ్యక్తిని నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

కిమ్ కింద ఉన్న అధికారులే కాదు..ఆ దేశ ప్రజలతో పాటు..శత్రు దేశాల అధ్యక్షులు, ప్రజలు కూడా గజగజ వణకాల్సిందే. ఎప్పుడు ఉత్తరకొరియా అణు బాంబులతో తమ దేశాలపై విరుచుకు పడుతుందోనని ఇప్పటికీ ఆందోళనలోనే ఉన్నాయి కొన్ని దేశాలు. ఇటీవల కాలంలో కిమ్ కు ఏదో ఆరోగ్య సమస్య తలెత్తిందని, అసలు ఆయన ఏ విధమైన సమావేశంలో గానీ, కార్యక్రమంలో గానీ కనిపించడం లేదంటూ తొలుత అమెరికా మీడియాలో కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అది నిజమేనని, కిమ్ ఇటీవలే ఏదో సర్జరీ చేయించుకోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అప్పట్లో కిమ్ సోదరి ఖండించారు. కిమ్ బాగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదని ప్రకటించారు.

అసలు విషయానికొస్తే..తాజాగా ఉత్తరకొరియా చేసిన మరో పని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఉత్తరకొరియాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లై ఒక పిల్లాడు పుట్టాక భార్యతో కలిసి సౌత్ కొరియాకు పారిపోయాడు. పిల్లాడిని మాత్రం తన అక్క వద్దనే ఉంచేశాడు. అప్పటి నుంచి బాబును అక్క, బావలే పెంచుతున్నారు. కాగా..ఇటీవల లాక్ డౌన్ తో అక్క చేసే వ్యాపారం కాస్త నష్టాల్లోకి వచ్చింది. దానికి తోడు బాబు కూడా తన తల్లి, తండ్రిని చూడాలని కోరడంతో ఎలాగైనా బాబుని తీసుకుని తమ్ముడి వద్దకెళ్లాలని భావించారు ఆ దంపతులు. కానీ లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులు నడవట్లేదు. మరో మార్గం ఆలోచించారు. నార్త్ కొరియా బోర్డర్ నుంచి చైనా లోని బ్యాంకాక్ లోకి వెళ్లి అక్కడి నుంచి తమ్ముడి వద్దకెళ్దామని భావించారు.

అనుకున్నదాని ప్రకారం బ్యాంకాక్ బోర్డర్ వద్దకు చేరుకున్నారు. నార్త్ కొరియా నుంచి బ్యాంకాక్ బోర్డర్ లోకి వెళ్తుండగా బోర్డర్ వద్దనుండే సిబ్బంది వారిని పసిగట్టి బంధించారు. ఎందుకు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించారని అడుగగా..అసలు విషయం చెప్పారు. కానీ నార్త్ కొరియా సిబ్బంది వారి మాటలను నమ్మలేదు. బోర్డర్ దాటేందుకు ప్రయత్నించి నేరం చేశారంటూ నిందించి వారికి ఉరిశిక్ష విధించారు. ఆ బాలుడు మైనర్ కావడంతో అతడిని మాత్రం హోమ్ కు తరలించారు. ఇప్పుడు ఆ బాలుడికి ఆలనా పాలనా చూసే అత్తమామ లేరు. ఉన్న తల్లిదండ్రులను అతడు కలవాలనుకున్నా కలవలేని పరిస్థితి. ఇలా ఏ తప్పు చేయని వారిని ఉరితీసిన నార్త్ కొరియా విమర్శలను ఎదుర్కొంటోంది. పాపం ఆ దంపతులు ఏ తప్పు చేయకపోయినా తనువు చాలించారు. ఇలా బయటికి రాని ఎన్నో ఘటనలున్నాయి.

Next Story