ఎవరెస్టు గురించి కొత్త లెక్క చెబుతున్న చైనా

By సుభాష్  Published on  28 May 2020 10:49 AM GMT
ఎవరెస్టు గురించి కొత్త లెక్క చెబుతున్న చైనా

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఏమిటంటే మౌంట్ ఎవరెస్టు అని చెబుతారు. తాజాగా చైనాకు చెందిన సర్వే టీమ్ ఎవరెస్టు హైట్ ను మరోసారి కొలిచింది. చైనా తాజా లెక్కల ప్రకారం.. ఎవరెస్టు శిఖరం ఎత్తు 8844.43 మీటర్లట. నేపాల్ గతంలో చెప్పిన ఎత్తు కంటే నాలుగు మీటర్లు తక్కువ అని చైనా బృందం చెబుతోంది.

ఎవరెస్టు పర్వతం ఎత్తు గురించి మే 1వ తేదీన చైనా నేపాల్ చెబుతున్న లెక్కలు తప్పు అని తెలిపింది. దీంతో చైనా సరికొత్త టీమ్ ను ఎవరెస్టు పర్వతం ఎత్తును కొలవడానికి పంపించింది. సర్వే టీమ్ మౌంట్ ఎవరెస్టును కొలిచి ప్రస్తుతం ఎవరెస్ట్‌ హైట్‌ 8844. 43 మీటర్లు అని తెలిపింది. ఇప్పటి వరకు నేపాల్‌​ ప్రభుత్వం ఎవరెస్ట్‌ ఎత్తును 8,848 మీటర్లుగా చెబుతోంది. చైనా-నేపాల్ దేశాల బార్డర్‌‌లో 2015లో వచ్చిన భూకంపం వల్ల శిఖరం ఎత్తు నాలుగు మీటర్లు తగ్గి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటూ చైనాకు చెందిన బృందం.. ఎవరెస్టు పర్వతం మీద ఉందట.. ఇది చైనా రికార్డుగా చెబుతున్నారు.

ఈ పర్వతం మీద సంభవించే మార్పులు ప్రపంచ భూగర్భ శాస్త్రం, జీవావరణ శాస్త్రం అధ్యయనాలకు కీలకమైనవి. ఇది ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇక చైనా చేస్తున్న సర్వేల ద్వారా ఎవరెస్టు పర్వతంపై 5జీ స్టేషన్ ను నిర్మించవచ్చా అన్నది కూడా తెలుసుకోవాలనే అంటున్నారు. హువావేతో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5జీ స్టేషన్లను నిర్మించడానికి చైనా ప్లాన్‌‌ చేస్తోందని.. అందుకే ఈ సర్వే అని అంటున్నారు.

చైనా-నేపాల్ ప్రభుత్వాలు.. 1961లో ఎవరెస్టు దగ్గర బోర్డర్ ను విభజిస్తూ తీర్మానం చేసుకున్నారు. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాలని అనుకునే చాలా మంది టిబెటన్ సైడ్ నుండే వెళుతూ ఉంటారు. చైనా మౌలిక సదుపాయాల విషయంలో నేపాల్ కంటే మిన్నగా ఉన్నప్పటికీ పర్వతారోహకులు నేపాల్ నుండే వెళుతూ ఉంటారు. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా ఇరు దేశాలు పర్వతారోహకులకు అనుమతులను ఇవ్వడాన్ని ఆపివేశాయి.

Next Story