సీబీఎస్ఈ ఫలితాల్లో ఒకేరకం మార్కులు తెచ్చుకున్న కవలలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 10:03 AM GMT
సీబీఎస్ఈ ఫలితాల్లో ఒకేరకం మార్కులు తెచ్చుకున్న కవలలు

కవలలు..నిజానికి కవలలంటే రూపు రేఖల్లో ఒకేలా ఉంటారు. కానీ.. వారి ఆహారపు అలవాట్లు, అభిరుచులన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఆరోగ్య పరంగా మాత్రం ఒకరికి ఆరోగ్య విషయంలో తేడా వస్తే మరొకరికి ఆటోమెటిక్ గా అనారోగ్యం వచ్చేస్తుందంటారు. కానీ..నోయిడా కు చెందిన ఇద్దరు కవల ఆడపిల్లలు రూపు రేఖల్లోనే కాదు..ఆహారపు అలవాట్లు, గేమ్స్, అభిరుచులు ఆఖరికి మార్కుల్లో కూడా ఒకేరకంగా ఉన్నారు.

2003 మార్చి 3వ తేదీన పుట్టారు కవలలు మానసి, మాన్య. వీరిద్దరి పుట్టుక మధ్య 9 నిమిషాలు తేడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా..సోమవారంజ్ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాయి. ఆ ఫలితాల్లో ఇద్దరికీ ఒకేరకమైన మార్కులు (95.8%) రావడంతో తల్లిదండ్రులు కాస్తంత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కేవలం చదువులోనే కాకుండా..గేమ్ లో కూడా ఒకేరకంగా ఉంటారని చెబుతున్నారు వారి తల్లిదండ్రులు. ఇద్దరికీ బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టమట. ఇలాంటి కవలలు ఉండటం కూడా చాలా అరుదని చెప్తున్నారు.

మాన్య మాట్లాడుతూ..తామిద్దరం సైన్స్ గ్రూపులోనే చేరినట్లు తెలిపింది. మానసి ఫిజిక్స్ లో చురుకు అయితే తాను కెమిస్ట్రీని బాగా అర్థం చేసుకుంటానని చెప్తోంది. అంతేకాక చదువు విషయంలో ఏమైనాసందేహాలొస్తే ఒకరికొకరం ఆ సందేహాలను తీర్చుకుంటు ఉంటామని పేర్కొంది. అయినప్పటికీ ఇద్దరికీ ఒకే రకమైన మార్కులు రావడం తనకు కూడా ఆశ్చర్యంగా ఉందంటోంది మాన్య.

Next Story
Share it