షాలినికి ఉంగరం తొడిగిన హీరో నితిన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2020 7:24 PM IST
షాలినికి ఉంగరం తొడిగిన హీరో నితిన్

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్-శాలిని ల నిశ్చితార్థ వేడుక జరిగింది. నిశ్చితార్థం జరిగింది అంటూ నితిన్‌ తన ట్విట్టర్‌ ఖతాలో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా కాబోయే భార్య షాలినికి ఉంగరం తొడుగుతున్న ఫోటోను పోస్టు చేశాడు. ఈ కార్యక్రమానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థంలో సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ షాలిని కనపడింది.

ఈ నెల 26న జరిగే వివాహ వేడుకతో ఈ ప్రేమ జంట ఒక్కటి కానుంది. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వేడుక నిర్వహించనున్నారు. 26న రాత్రి 8.30 గంటలకు ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో పెళ్లి జరగనుంది. ఇప్పటికే పలుమార్లు వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అమెరికాకు చెందిన షాలినితో కొద్దికాలంగా నితిన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లికి ఏప్రిల్ 15వ తేదీన వివాహం, ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు. దుబాయ్‌లో జరిగే డిస్టినేషన్ వెడ్డింగ్‌కు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్‌లోనే నిర్వహించేందుకు కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ‘భీష్మ’ సక్సెస్‌లో ఉన్న నితిన్.. ‘రంగ్ దే’, ‘అంధాధున్ రీమేక్’, ‘పవర్ పేట’, ‘చెక్’ సినిమాల్లో నటిస్తున్నాడు.



Next Story