4గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్.. పారిశ్రామిక వర్గాల్లో ఉత్కంఠ!
By Newsmeter.Network
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో అందరిలోనూ నిర్మలా ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి మాట్లాడుతూ.. 20లక్షల కోట్ల మెగా ఫైనాన్సియల్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ సమగ్ర రూపాన్ని ఆర్థిక మంత్రి వివరిస్తారని ఆయన తెలిపారు. కాగా మరుసటి రోజే నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్యాకేజీలో ఏ వర్గానికి ఎంత ప్రయోజనం కల్పిస్తారోనని అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read :వెనక్కి తగ్గని జగన్.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు
ఇప్పటికే దాదాపు 50రోజులుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఇటీవల కొద్దిపాటి సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దుకాణాలు, సంస్థలు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ కారణంగా నెలన్నరపాటు అన్ని వర్గాల ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా నష్టాలబాట పట్టాయి. రైతులు, లేబర్స్, ఎంప్లాయిస్ ఇలా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక సహాయం ఏఏ రంగానికి ఎంత కేటాయిస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందని ఇప్పటికే మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు మేలు జరిగేలా ప్యాకేజీ కేటాయింపులు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ ఏఏ వర్గాలకు తీపికబురు వినిపిస్తారో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల్లో ఈ ప్యాకేజీ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ప్యాకేజీ సమగ్ర స్వరూపం ఎలా ఉటుంది, పారిశ్రామిక రంగానికి ఏ విధంగా మేలుచేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read :‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో ప్యాకేజీ: ప్రధాని మోదీ