నిర్భయ దోషులపై ఢిల్లీ పటియాల కోర్టు మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇప్పటి వరకు రెండు సార్లు ఉరిశిక్ష అమలు చేసినా.. దోషుల క్షమాభిక్ష పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురి దోషులను ఉరి తీయాలంటూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. కూతురుపై జరిగిన దారుణంపై ఏడేళ్లుగా పోరాడుతున్నానని, తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికి కోర్టుపై నమ్మకం ఏర్పడిందని, తనకు ఇప్పడైన సరైన న్యాయం జరుగుతుందనే భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు సార్లు కోర్టు నలుగురు దోషులపై డెత్‌ వారెంట్లు జారీ చేసినా.. తర్వాత వాయిదా పడుతూ వచ్చిందని, ఏదేమైనా కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.