లేగదూడ‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డ కామాంధుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 March 2020 9:24 PM IST
లేగదూడ‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డ కామాంధుడు

ఓ కామాంధుడు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ప‌ని చేశాడు. మూగ‌జీవిపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. 9నెల‌ల‌ లేగదూడ‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌.. హైదరాబాద్ నారాయణ గుడా పోలీస్ స్టేష‌న్ ప‌రిధి అవంతి నగర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. కిషోర్ వర్మ అనే వ్యక్తి తన ఇంట్లో కొంతకాలంగా పశువుల షెడ్‌ను నడిపిస్తున్నాడు. గత కొద్ది రోజులు క్రితం పశువుల షెడ్‌లో మహేష్ పనికి కుదిరాడు.

అయితే.. నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో.. పశువుల షెడ్‌లో క‌ట్టేసి ఉన్న‌ తొమ్మిది నెలల లేగదూడపై తన కామ వాంఛ తీర్చుకుంటున్న మహేష్‌ను.. యజమాని కిషోర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విష‌య‌మై కిషోర్ వెంట‌నే నారాయ‌ణ గుడా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న దర్యాప్తు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు త‌ర‌లించారు.

Next Story