కామంతో కళ్లు మూసుకుపోయిన భర్త బరితెగించాడు. తన కామకోరికలు తీర్చుకునేందుకు ఫ్రెండ్స్‌తో భార్యలను మార్చుకుని తన కామవాంచలు తీర్చుకునేవాడు. భార్యకు ఇష్టం లేకపోయిన నీలిచిత్రాలు చూపించి మరీ ఫ్రెండ్స్‌ గదిలోకి తీసుకెళ్లేవాడు. వాళ్లు ఆమెను రేప్‌ చేస్తుండగా.. వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు. భర్త వేదింపులు భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.

ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్(46) కామంతో రగిలిపోయేవాడు. తన మిత్రులతో కలిసి భార్యల మార్పిడికి పాల్పడ్డాడు. కాగా.. అతని కామకోరికలకు తన భార్య(39)ని బలి చేశాడు. బిజినెస్ మ్యాన్, అతని ఫ్రెండ్స్ వైఫ్ స్వాపింగ్‌ పేరుతో భార్యలను మార్చుకుని ఒకరి భార్యతో మరొకరు ఎంజాయ్ చేస్తూ తమ కామవాంఛలను తీర్చుకునేవారు. భార్యల మార్పిడికి బిజినెస్ మ్యాన్ భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను బలవంతం చేసేవాడు. భార్యకు ముందుగా పోర్న్ వీడియోలు చూపించి.. రెచ్చగొట్టేవాడు. ఆ తరువాత ఆమెను ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి వారి స్నేహితులకు లైంగిక సుఖాన్ని ఇవ్వాలని వేధింపులకు గురిచేసేవాడు. ప్రెండ్స్‌ అతని కళ్ల ముందే దారుణంగా రేప్ చేస్తుంటే.. వీడియో తీస్తూ పైశాచికానందం పొందేవాడు. కొంతకాలం ఈ వేదింపులను మౌనంగా భరించిన ఆ భార్య.. రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతుండడంతో తట్టుకోలేకపోయింది. గత డిసెంబర్‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

2017లో బాధితురాలు తొలిసారి భర్త ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురైందని.. అప్పుడు ఆమె మానసికంగా కుంగిపోయిందని.. రెండేళ్ల తరువాత బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. భర్త విపరీతమైన కామవాంఛలు, ఫాంటసీల కారణంగానే భార్యకు పోర్న్ వీడియోలు చూపించడం.. ఫ్రెండ్స్‌తో భార్యను సెక్స్ చేయమని ఒత్తిడి చేయడం.. వాటిని వీడియోలు తీయడం వంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ అది భార్య కోరికే అయితే.. ఆమె వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్న సమయంలో భర్త వీడియో తీయలేడని.. అది ముమ్మాటికీ భర్త విశృంఖల శృంగార వాంఛలకు అద్దంపడుతోందని పేర్కొంటూ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. ఇష్టం లేకపోయినా ఫ్రెండ్ భార్యపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు సమాచారం.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.