నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ మళ్లీ వాయిదా.. సీజే ఆగ్రహం.. ఎందుకంటే
By సుభాష్ Published on 29 April 2020 2:56 PM ISTఏపీ రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారం వరకు వాయిదా వేసింది హైకోర్టు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు.. అనంతరం సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, సోమవారం వాదనలు నేరుగా వింటామని, న్యాయవాదులకు, పిటిషన్లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
విచారణ జరుగుతున్న సమయంలో సీజే ఆగ్రహం
బుధవారం కొందరు పిటినర్ల తరపున వాదనలు వినేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతున్న సమయంలో సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో అనుమతించిన వారు కాకుండా ఇతర లాయర్లు పక్కనే ఉండటంతో మండిపడ్డారు. విచారణకు సంబంధించి పది మందికి వీడియో కాన్ఫరెన్స్ పాస్‌వర్డ్ ఇస్తే, ఒకే సారి 40 మంది ఎలా వచ్చారని సీజే ప్రశ్నించారు. పాస్‌వర్డ్ లీక్ చేయడం వల్ల ఇలా జరుగుతుందని అన్నారు.
సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కాకుండా హైకోర్టులోనే విచారణ ఉంటుందని, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా తొలగించడాన్ని నిమ్మగడ్డ రమేష్ ను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై మరి కొందరు పిటిషన్లు వేయగా, హైకోర్టు విచారణ చేపట్టింది.