పెళ్లి చేసుకోబోతున్న నిహారిక.. కాబోయేవాన్ని హత్తుకుని..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2020 7:52 PM ISTమెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి ఫిక్స్ అయ్యింది. అందుకు సంబంధించిన హింట్స్ ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు ఇస్తూ వస్తోంది. ఈరోజు ఉదయం నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేసి చూస్తే ఆమె పెట్టిన పోస్టుపెళ్లి గురించేనా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. స్టార్ బక్స్ కాఫీ కప్‌పై ఉన్న మిస్ నిహా పేరులో మిస్‌ని కట్ చేసి మిస్సెస్ అని ఉంది. ఆ మిస్సెస్ పక్కన ప్రశ్నార్ధకం గుర్తుని ఉంచడంతో నిహారిక పెళ్లి జరగబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన ఎవరా అన్న విషయం తెలుసుకోడానికి నెటిజన్లు ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు.
ఆ హింట్ ఇచ్చిన కొన్ని గంటలకు నిహారిక తనకు కాబోయే వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. నవ్వుతూ.. వేలి మీద ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ నిహారిక కాబోయే వరుడి గురించి నెటిజనులకు ఓ హింట్ ఇచ్చింది. తనకి కాబోయే భర్తని హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయేవాడి బ్యాక్ సైడ్ నుండి మాత్రమే చూపించింది. అతను ఎవరా అన్నది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో నిహారికకు కాబోయే వరుడు ఎవరా అన్న సస్పెన్స్ ను అందరినీ వెంటాడుతోంది.