గుడ్‌న్యూస్ :‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను క‌నుగొన్న నైజీరియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 5:27 AM GMT
గుడ్‌న్యూస్ :‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను క‌నుగొన్న నైజీరియా

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ కరోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా స‌రే క‌రోనాకు కళ్లెం వేయాల‌ని ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్‌ల‌ను మనుషులపై ప్రయోగించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 120కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యాయి.

భార‌త్‌, అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా అలాంటి అగ్ర‌ దేశాలు కోట్ల ర‌పాయ‌లు ఖ‌ర్చు చేస్తూ కరోనా వ్యాక్సిన్ తయారీలో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. అయితే భార‌త్‌లో తాజాగా నోటిద్వారా వేసుకునే మందులు కొన్నింటిని రిలీజ్ చేశారు.

ఇదిలావుంటే.. ఆఫ్రికా దేశం.. నైజీరియా చెందిన ప‌లు యూనివ‌ర్సిటీలు క‌రోనాకు వ్యాక్సిన్‌ను క‌నుగొన్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్లు శుక్ర‌వారం స్థానిక మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. వ్యాక్సిన్ తయారీకి సంబంధించి కొంత సక్సెస్ సాధించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఆఫ్రికాలో కేవ‌లం ఆఫ్రికన్ల కోసం మాత్ర‌మే కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేసినట్టు.. అడిలెక్ యూనివర్శిటీలో మెడికల్ వైరాలజీ, ఇమ్మ్యూనాలిటీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఒలడిపో వెల్ల‌డించారు. అయితే.. ఇంకా కొన్ని ట్రయల్స్ జ‌ర‌గాల్సివుంద‌ని.. దీనికి సంబంధించిన సూది మందు అంద‌రికీ అందుబాటులోకి రావ‌డానికి మాత్రం.. కనీసం 18 నెలల సమయం పడుతుందని అన్నారు.

Next Story