న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 24 Jun 2020 3:56 PM ISTఏపీ రాజకీయాల్లో రచ్చ పుట్టిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ
ఏపీ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో మరోసారి వివాదస్పదంగా మారింది. బీజేపీ నేతలు ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో నిమ్మగడ్డ భేటీ వీడియోలు బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చ రచ్చ జరుగుతోంది... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
విజయవాడలో సంపూర్ణ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం యూటర్న్
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగిపోయాయి. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక విజయవాడలో కూడా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఈ నగరాలను కరోనా నుంచి కాపాడటం కష్టమేనా..?
దేశంలో కరోనా దెబ్బకు నగరాలు కాకవికలమవుతున్నాయి. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా ఉన్నా.. తాజాగా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే.. నగరాల్లోనే అధికంగా కరోనా వ్యాప్తి ఉంది. అయితే ఇందుకు కారణం జనాభా ఎక్కువగా ఉండటం, లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 15,968 పాజిటివ్ కేసులు..
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తోంది. లాక్‌డౌన్ సడలింపులతో దేశంలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,968 కొత్త కేసులు నమోదు కాగా.. 465 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వీరిలో ఎవరితో డేట్‌కు వెళ్లాలని ఉందని అడిగిన భజ్జీ, యువీ.. షాకిచ్చిన గంగూలీ
కరోనా ముప్పుతో క్రీడలు అన్ని రద్దు అయ్యాయి. ఇక లాక్‌డౌన్‌తో క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. వీరంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో మయా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల అందరిని ఆకర్షిస్తున్న యాప్ జెండర్ స్వాప్. ఈ యాప్ ఆడవారు మగవారిగా, మగవారు ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని,.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందా..!
కరోనా తెచ్చే కష్టాలు అన్ని ఇన్ని కావు. చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కొందరికి కరోనా వచ్చిన తర్వాత కూడా మళ్లీ నెల రోజుల్లోనే తిరగబడే అవకాశాలున్నాయని కూడా పరిశోధనల్లో తేలింది. అయితే కరోనా నుంచి కోలుకున్న .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఫాబి ఫ్లూ.. కోవిఫర్.. సిప్రెమి.. గేమ్ ఛేంజర్లు ఎంతమాత్రం కావా?
కొరకరాని కొయ్యలా మారిన కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమకాలీన కాలంలో యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఉదంతం ఏమైనా ఉందంటే ఇదేనని చెప్పక తప్పదు. అన్ని వ్యవస్థల్ని స్తంభించిపోయేలా చేసిన ఈ మహమ్మారికి నేటికి వ్యాక్సిన్ రాలేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలీని పరిస్థితి. కాకుంటే.. కొద్దిరోజులుగా వస్తున్న కొత్త ఔషధాల మీద సాగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
ఆయనో ఐఏఎస్ అధికారి. కొన్ని నెలల క్రితం కోటిన్నర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన్ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చారు. కట్ చేస్తే.. తాజాగా ఆయన సూసైడ్ చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయి పడి ఉన్న వైనాన్ని గుర్తించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజకీయాలకతీతంగా పథకాలు అందిస్తున్నాం: ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ప్రారంభోత్సవంలో జగన్
ఏపీ జగన్ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల వారికి అండగా ఉంటానన్న మాటను నెరవేర్చుకుంటూ వస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూర్చే విధంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి