చరిత్ర సృష్టించబోతున్న కేసీఆర్

KCR will be the longest-serving CM in Hyderabad. మార్చి 14, 2023న హైదరాబాద్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2022 5:04 PM IST
చరిత్ర సృష్టించబోతున్న కేసీఆర్

మార్చి 14, 2023న హైదరాబాద్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు రికార్డు సృష్టించనున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పేరిట ఉన్న రికార్డును కేసీఆర్ బద్దలు కొట్టనున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల, 8 నెలలు, మరియు 13 రోజులు (సెప్టెంబర్ 1, 1995 నుండి మే 13, 2004 వరకు) హైదరాబాద్‌లో ఉన్నాడు. అది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి అధికార కేంద్రంగా ఉంది. చంద్రబాబునాయుడు 2014 - 2019 మధ్య పూర్తి కాలానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కేసీఆర్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం పాటు.. దాదాపు 13 సంవత్సరాల పాటు పోరాడాడు. ఒంటరిగా ఎన్నికల్లో పోరాడి టీఆర్‌ఎస్‌ను విజయపథంలో నడిపించి.. తన పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. రెండోసారి కూడా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో 2023 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య స్పష్టమైన త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కేసీఆర్‌దే కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2, 2022కి 8 సంవత్సరాలు. ముఖ్యమంత్రిగా కూడా అన్నే ఏళ్లు ఆయన అధికారంలో ఉన్నారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో చాలా వరకు నెరవేర్చారు.

కేసీఆర్ వాగ్ధానాలు :

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించనున్నారు. 54 లక్షల ఇళ్లకు, తెలంగాణలోని భూములకు సాగునీటి సౌకర్యాన్ని అందించాలనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన ప్రాజెక్ట్ కాళేశ్వరంమల్టీ-స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేర్చేందుకు రాష్ట్రం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, అభివృద్ధి, సంక్షేమాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. తనను విమర్శించిన వారికి ఆయన తన పని తీరుతోనే బదులు చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. తమ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో ఒకరికైనా లబ్ధి చేకూరాలనేది కేసీఆర్ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పనితీరు, GSDP వృద్ధి, తలసరి ఆదాయంలో పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి, సమర్థవంతమైన శాంతిభద్రతలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గౌరవ గృహాలు, కేసీఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు (వృద్ధాప్య పింఛన్లు), మత్స్య సంపద, గొర్రెల పెంపకం మరియు పంపిణీ వంటి సంక్షేమ పథకాలు వంటివి కొనసాగిస్తూ ఉన్నారు.

గ్లోబల్ సిటీగా హైదరాబాద్ :

రాష్ట్ర జనాభాలో నాల్గవ వంతు ఉంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ నగరం అనేక ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ సంస్థలకు గమ్యస్థానంగా మారింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, నోవార్టిస్, మైక్రోన్ ఇలాంటి ఎన్నో సంస్థలు హైదరాబాద్ లో ఆఫీసులు ఓపెన్ చేసేశాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభినందనీయం.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్న వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్‌ను రూపొందించడానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయి.

హిట్స్ మాత్రమే కాదు.. ఫ్లాప్స్ కూడా..

తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో వెనకబడి ఉంది. అధికారంలో ఉండి 8 ఏళ్లు గడిచినా లబ్ది దారులకు అవసరమైన గృహాలను అందించలేకపోయింది. భూ పట్టాల లభ్యతపై ప్రభుత్వం దృష్టిసారించకుండా, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల వాగ్దానం ఒక కలగానే మిగిలిపోయింది. వ్యవసాయానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ ముందుకు వచ్చినా, వరి సాగు విషయంలో మాత్రం విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.

అనేక పథకాలు, 'కేంద్రం ఉద్దేశపూర్వకంగా సహకరించని కారణంగా రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితి చాలా కష్టాల్లో ఉంది. 'దళిత బంధు' వంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించిన కేసీఆర్.. ఆయన్ను గద్దె దించేందుకు కూడా దూసుకుపోతున్న విపక్షాలను అడ్డుకోడానికి ప్రయత్నాలు చేయడం లేదు.

లోపాలను పరిగణనలోకి తీసుకుని.. అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి, అట్టడుగు స్థాయిలో తన మూలాలను పటిష్టం చేసుకోడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కొత్త ఆలోచనతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు I-PAC వంటి పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహకర్తలను టిఆర్‌ఎస్ ఉపయోగించుకుంటోంది.


































Next Story