కొత్త సంవత్సరంలో డేట్ అలా రాస్తే డేంజర్...

By రాణి  Published on  27 Dec 2019 6:04 PM IST
కొత్త సంవత్సరంలో డేట్ అలా రాస్తే డేంజర్...

న్యూ ఇయర్..మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం 2020 లోకి అడుగు పెట్టబోతున్నాం. రెండు దశాబ్దాలుగా విజన్ 2020, లీక్ ఇండియా 2020 మాటలు వినని తెలుగువాడు, భారతీయుడు లేడు అనడంలో ఆశ్చర్యం లేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్లో కానీ... ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ.. ఈ పదాలు ఎక్కువగా వినపడేవి. అయితే ప్రస్తుతం కొత్త సంవత్సరంపై ఒక ఆసక్తికరమైన వార్త వాట్సాప్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..కొత్త సంవత్సరంలో ఎవరైనా ఎక్కడైనా తేదీ రాసేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని. లేదంటే పెద్ద పెద్ద చిక్కుల్లో పడతారట.

ఇంతకీ విషయమేమిటంటే..కొత్త సంవత్సరం మొదటి నెల నుంచి చివరి నెల వరకూ తేదీలు రాసేటప్పుడు ఆఖరిలో సంవత్సరం రాయాల్సిందే కదా. అలా రాసేటపుడు 01/01/20 అని రాస్తే 01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. అది ఒప్పందాల విషయంలో కావచ్చు, బ్యాంక్ లావాదేవీలు, ల్యాండ్ రిజిస్ర్టేషన్లు, ఇతర కాంట్రాక్టులు, చెక్ లు చెల్లించేటపుడు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తత్ఫలితంగా చాలామంది మోసపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అందుకే డేట్ రాసేటప్పుడు చివరలో ఖచ్చితంగా సంవత్సరం పూర్తిగా రాయాలని చెప్తోందీ మెసేజ్. ఈ ఏడాదంతా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే..నష్టపోకుండా జాగ్రత్తపడినవారమవుతాం.

Next Story