​వచ్చే ఏడాది నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త నిబంధన అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నగదు అక్రమ విత్‌ డ్రాలు, ఏటీఎంలలో మోసాలు అరికట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని మరో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విటర్‌లో వివరాలు వెల్లడించింది. అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ట్వీట్  చేసింది. అదేంటంటే..

విత్‌ డ్రాకు సంబంధించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే బ్యాంకుకు అనుసంధానం చేసిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌చేసిన తర్వాతే డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ ఓటీపీ ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రా సేవలు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

అలాగే ఎస్‌బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు ఏటీఎంలలోకి వెళితే ఈ ఓటీపీ విధానం వర్తించదు. కేవలం రూ. 10వేలకుపైగా లావాదేవీలకు మాత్రమే ఓటీపీ వస్తుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.