ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే ఇది తప్పనిసరి
By సుభాష్ Published on 27 Dec 2019 5:22 PM ISTవచ్చే ఏడాది నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త నిబంధన అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నగదు అక్రమ విత్ డ్రాలు, ఏటీఎంలలో మోసాలు అరికట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని మరో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విటర్‌లో వివరాలు వెల్లడించింది. అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. అదేంటంటే..
విత్ డ్రాకు సంబంధించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే బ్యాంకుకు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌చేసిన తర్వాతే డబ్బులు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ ఓటీపీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే ఎస్‌బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు ఏటీఎంలలోకి వెళితే ఈ ఓటీపీ విధానం వర్తించదు. కేవలం రూ. 10వేలకుపైగా లావాదేవీలకు మాత్రమే ఓటీపీ వస్తుంది.