హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 12:20 PM GMT
హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..!

హైదరాబాద్‌లో కలకలం రేపిన పరువు హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి కొంతమంది వ్యక్తులకు సుపారీ ఇచ్చి హేమంత్‌ను హత్య చేయించారని వార్తలు వినిపించాయి. అయితే.. కిరాయి హంతకులు చేత హేమంతను అవంతి మేనమామ యుగంధర్‌ హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య కోసం వట్టినాగులపల్లి, గోపనపల్లికి చెందిన ఇద్దరు కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకున్నాడు యుగంధర్‌. వారికి పది లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డితో పాటు బంధువులు రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, సందీప్ రెడ్డి, డ్రైవర్ సాహెబ్ పటేల్, స్పందన, స్వప్న, రజిత, అర్చనపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రేమ వివాహం నచ్చని యువతి బంధువులు యువకుడిని కిడ్నాప్‌ చేసి సంగారెడ్డిలో హత్య చేయించారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ యువజంట తండ్రికి భయపడి చందానగర్‌ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్‌ చేయగా, యువతి పారిపోయి 100 డయల్‌కు సమాచారం అందించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించడంతో అక్కడే హత్య కేసు నమోదు చేశారు.

Next Story