వాయుసేనకు కొత్త చీఫ్ భదౌరియా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2019 6:31 PM IST- వాయుసేన కొత్త చీఫ్ గా భదౌరియా
- భదౌరియా పదవి కాలం 3 ఏళ్లు పొడిగింపు
- ఈ నెల 30తో బీఎస్ ధనోవా పదవి కాలం ముగింపు
- భదౌరియా సీనియారిటిపై కేంద్రం నమ్మకం
ఢిల్లీ: భారత వాయుసేనకు కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది.ఆర్కేఎస్ భదౌరియాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వాయుసేనాధిపతి బీఎస్ ధనోవా టైమ్ ఈ నెల 30తో ముగియనుంది. దీంతో వైస్ చీఫ్‌గా ఉన్న భదౌరియాకు బాధ్యతలు అప్పగించారు.వాస్తవానికి భదౌరియా కూడా ఈ నెల30నే పదవి విరమణ చేయాలి. కాని..కేంద్రం మరోలా ఆలోచించింది. ఆయన పదవి కాలాన్ని మూడేళ్లు పొడిగించి..వాయు సేనాధిపతిగా నియమించింది. ప్రస్తుతం భదౌరియా వయసు 62 ఏళ్లు. అయితే.. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాయుసేన పాత్ర కీలకం కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాయుసేనాధిపతిగా భదౌరియా ఎలా నెట్టుకొస్తారో చూడాలి.
Next Story