తెలంగాణలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 4:10 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2751 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. కరోనాతో కొత్తగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 808కి చేరుకుంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,20,166 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30,008 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో 62,300 శాంపిళ్లు పరీక్షించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 432 పాజిటివ్ కేసులు, కరీంనగర్ 192, మేడ్చల్-మల్కాజ్‌గిరి 128,నల్లగొండ 147, నిజామాబాద్ 113, రంగారెడ్డి 185,సూర్యాపేట 111, వరంగల్ అర్భన్ 101 కేసులు. ఇతర జిల్లాల్లో వందలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 1675 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 89,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి.
తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో హైదరాబాద్‌లో ఎక్కువగా కేసులు నమోదైతే ఇతర జిల్లాల్లో కేసులు పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్ని జిల్లాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం.