నెట్‌ప్లిక్స్ బంఫర్ ఆఫర్ ప్రకటించిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 April 2020 10:15 AM ISTనెట్‌ప్లిక్స్.. ఇంటర్నెట్ వాడకం తెలసిన వారందరికి తెలిసిన పదం. ఎంటర్‌టైన్‌మెంట్ యాప్. ఆసక్తికరమైన వెబ్ సిరీస్, సూపర్ హిట్ క్రైం, కామెడీ, హర్రర్ సినిమాలు ఒక్కచోట లభించే ప్లాట్‌ఫామ్. సో.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఇందరికి ఈ యాప్ సుపరిచితమే. అయితే.. కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్‌లో ఇంటిపట్టునే ఉంటున్న అందరికి నెట్‌ప్లిక్స్ శుభవార్త అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే నెల రోజులుగా ఇంటిపట్టునే ఉన్న జనానికి అది ఫేక్ వార్తో లేక నిజమో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అంతలా ఇబ్బంది కలిగిస్తున్న ఆ వార్త ఏంటంటారా..? నెట్‌ప్లిక్స్ ప్రీమియమ్ ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించిందనే వార్త. అవును.. గతంలో నెట్‌ప్లిక్స్ సైనప్ కస్టమర్లకు 30రోజుల ఫ్రీ సబ్‌స్క్రిస్షన్ ఇచ్చింది.
అయితే.. ఇప్పుడు ఏకంగా రెండు నెలలపాటు ఫ్రీ ఆఫర్ ప్రకటించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. అవును కరోనా వైరస్ కారణంగా ఆర్థికమాంద్యంలో ఉన్న కారణంగా నెట్‌ప్లిక్స్ ఎటువంటి నెలవారి ఛార్జీలు లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా 60 రోజుల పాటు ఉచితంగా యాప్‌లో కార్యక్రమాలు వీక్షించే విధంగా ప్రీమియమ్ ప్రీ ఆఫర్‌ను ప్రకటించిందని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంది కదానీ.. ఏ లింక్ పడితే.. ఆ లింక్‌ను డౌన్‌లోడ్ చేయకండి. ఒకవేళ ఫేక్ లింకులతో హ్యాకింగ్‌కు పాల్పడే సైబర్ నేరగాళ్ల పనికావొచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రీ ఆఫర్ వార్తలను నెట్‌ప్లిక్స్ గతంలో ఖండించింది.