కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇప్పటికే టాలీవుడ్ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ (సినీ క్రైసిస్ ఛారిటీ)ని స్థాపించారు. ఈ సంస్థకు టాలీవుడ్ కథానాయకులు, దర్శకులు, నిర్మాతలందరూ తమవంతు చేయూతనందించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, సీరియల్, వెబ్ సిరీస్ కార్మికులను ఆదుకునేందుకు ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా రిలీఫ్ ఫండ్ ను కూడా స్థాపించారు.

Also Read : కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్

లాక్ డౌన్ వల్ల అన్ని రకాల షూటింగ్ లు ఆగిపోవడంతో ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పనిచేసే విద్యుత్, ఇతర దినసరి కూలీలంతా కుటుంబ పోషణ గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు నెట్ ఫ్లిక్స్ తనవంతు చేయూతనందించింది. ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా కు రూ.7.5 కోట్ల విరాళాన్నివ్వనున్నట్లు ప్రకటించింది.

Also Read :హైదరాబాద్‌: మద్యం షాపులో దొంగలు పడ్డారు.. భారీగా మద్యం ఎత్తుకెళ్లారు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.