కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్

By రాణి  Published on  4 April 2020 12:41 PM GMT
కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్

ఏ ఉద్యోగి అయినా తన పనితనాన్ని చూసి మెచ్చుకుంటే..ఆ ఆనందానికి అవధులుండవు కదా. సరిగ్గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ విషయంలో ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా ఎక్కడికక్కడ పోలీసులను కాపలా పెట్టారు. రేయనకా, పగలనకా పోలీసులు కంటిమీద కునుకు లేకుండా, వారి కుటుంబాలను వదిలి..ప్రజా కుటుంబాన్ని రక్షిస్తున్నారు. అలా సిటీలోని చెక్ పోస్టుల్లో, కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో శుక్రవారం రాత్రి సీపీ అంజనీ కుమార్ కొద్దిసేపు ముచ్చటించారు. పోలీస్ కుటుంబాల బాగోగులు, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Also Read : పాక శాస్త్రానికి పనిచెప్పిన ఎమ్మెల్యే రోజా..

అలా లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాయికిషన్‌ తో మాట్లాడిన సీపీకి ఓ శుభవార్త తెలిసింది. కష్టకాలంలో ఆ కానిస్టేబుల్ చెప్పిన విషయం విన్న సీపీ అతనికి మిఠాయిలు, బిస్కెట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఆ శుభవార్త అని ఆలోచిస్తున్నారా ? రెండ్రోజుల క్రితమే అతని భార్య పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారట. ఆ విషయం తెలిసిన సీపీ తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ను అభినందించారు. సీపీ అంజనీకుమార్ తనను అంతలా అభినందించడంతో సాయికిషన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఎన్నిరోజులైనా ఇలా పనిచేయడానికి సిద్ధమని పేర్కొన్నారు సాయికిషన్.

Also Read :విధుల్లో అలసి సొలసిన పోలీస్

Next Story