పాక శాస్త్రానికి పనిచెప్పిన ఎమ్మెల్యే రోజా..

By రాణి  Published on  4 April 2020 8:38 AM GMT
పాక శాస్త్రానికి పనిచెప్పిన ఎమ్మెల్యే రోజా..

కరోనా కారణంగా వచ్చిన 21 లాక్ డౌన్ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాసంస్థలు పోలీసులకు, యాచకులకు, స్లమ్ ఏరియాల్లో ఉండేవారికి రెండుపూటలా కడుపునిండా భోజనమందిస్తున్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా స్వయంగా వంటచేసి 500 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే నగరంలో తిరుగి..మాస్కులు పంపిణీ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని, శానిటైజర్లు వాడాలని సూచిస్తున్నారు. బయటివారికే కాదండోయ్..ఇంట్లో భర్త, పిల్లలకు కూడా తన చేతివంట రుచి చూపిస్తున్నారు.

Also Read : తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి

సాధారణంగా అయితే రాజకీయాలు, షూటింగులతో ఇంట్లో వారితో గడిపేందుకు క్షణం తీరికుండదు. ఇప్పుడు ఖాళీ దొరికింది గనుక వంటింటికి పనిచెప్పారు రోజా. చికెన్ ఫ్రై, స్నాక్స్, గుత్తివంకాయ మసాలా కర్రీ ఇలా తనకొచ్చిన వంటకాలతో కుటుంబాన్ని నోరూరించేస్తున్నారు. భర్త, పిల్లలకే కాదు..నెటిజన్లకు కూడా తన వంటకాల రెసిపీని పరిచయం చేస్తున్నారు రోజా. ఇదిగో గుత్తివంకాయ మసాలా కూర ఇలా చేసుకోవాలంటూ వీడియో కూడా తీశారు.

Also Read :విధుల్లో అలసి సొలసిన పోలీస్

Next Story
Share it