తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి

By రాణి  Published on  4 April 2020 6:03 AM GMT
తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి

అసలే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారానికి 229 కేసులుండగా..ఢిల్లీ లింక్ కేసులే అధికం. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొమోరిన్ నుంచి రాయలసీమ వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : నిజమెంత: ముస్లిం వ్యక్తి ఆహారంలో ఉమ్మేస్తున్నాడా..?

కరోనా వైరస్ అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండలేదని ఇంతవరకూ నిపుణులు చెప్పిన మాటలతో ప్రజలు కాస్తో కూస్తో ధైర్యంగా ఉంటున్నారు. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై..భాగ్యనగరమంతా చల్లబడింది. ఇలాంటి సమయంలో ఎక్కడో ఒక చోట కరోనా లక్షణాలున్నవారు గనుక బయటికొస్తే..వారిద్వారా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. శుక్రవారం వరకూ భగభగమన్న ఎండలు..శనివారం అస్సలు కనిపించలేదు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో..ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Also Read : ఏప్రిల్‌ 15 నుంచి విమాన సర్వీసులు!

మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులు చూసి రైతన్నలు కూడా కంగారు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పంటల కొనుగోలు ఆలస్యమవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో పంటలు ఇంకా రైతుల చేతులకు రాకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Next Story
Share it