ముంబై: ఉద్దవ్ థాకర్, శరద్ పవార్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. శివసేన ఎంపీ దగ్గరుండి ఉద్దవ్ తో శరద్‌ పవార్‌ను మాట్లాడించినట్లు తెలుస్తోంది. దీంతో శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ – ఎన్సీపీ రెడీ అవుతున్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.బీజేపీతో ఇప్పటికీ మాటమంతీ లేకపోవడంతో శివసేన కాంగ్రెస్ కూటమికి దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. సిద్ధాంత వైరుధ్యం ఉన్న కాంగ్రెస్‌ – ఎన్సీపీతో శివసేన కలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అసెంబ్తీ ఎన్నికల్లో శివసేన 56స్ధానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 54సీట్లు, కాంగ్రెస్ 44సీట్లు గెలుచుకున్నాయి. ఈ ముగ్గురు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాని..బీజేపీ 105 సీట్లు గెలుచుకుని ఉంది. అతి పెద్ద పార్టీ బీజేపీనే. అయితే..ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికైతే..శివసేన దూకుడుగా ఉన్న మాట వాస్తవమే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.