నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం... విష ప్రయోగం జరిగిందా??

By సత్య ప్రియ  Published on  23 Oct 2019 8:13 AM GMT
నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం... విష ప్రయోగం జరిగిందా??

లాహోర్ జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం రాత్రి ది సర్వీస్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అయితే, తన తండ్రిపై విషప్రయోగం జరిగిందని, అందుకే ఆయన ప్లేట్‌లెట్ల సంఖ్య 16,000కు పడిపోయిందని షరీఫ్‌ కుమారుడు హుస్సేన్‌ ఆరోపించారు. దీనిపై ఇమ్రాన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారని, అనారోగ్యానికి గురైతే సరైన సమయంలో హాస్పిటల్‌కు తరలించలేదని దుయ్యబట్టారు. దీనికి ఇమ్రాన్‌ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని హుస్సేన్ డిమాండ్‌ చేశారు.

అయితే, ప్రస్తుతం నవాజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. డాక్టర్ అయాజ్ మహ్మద్ నేతృత్వంలో వైద్యుల బృందం నవాజ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

Next Story