డబుల్ ధమాకాతో.. ఎంట్రీ అదుర్స్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2019 5:44 PM ISTవిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా బౌలర్ నవదీప్ సైనీ. అయితే.. ఈ ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నాడు ఈ యువ బౌలర్. తనమొదటి వికెట్‌గా విండీస్ చిచ్చర పిడుగు హిట్‌మెయిర్ వికెట్‌ను పడగొట్టాడు. దీంతో ఈ వన్డే తనకు గ్రాండ్ ఎంట్రీ అన్నట్లే.
నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ 30 ఓవర్ రెండో బంతిని హిట్‌మెయిర్ పుల్ చేసాడు. అది కాస్తా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ క్యాచ్‌గా అందుకోవడంతో మంచి ఊపుమీదున్న హిట్‌మెయిర్ ఇన్నింగ్స్ 37 పరుగుల వద్ద ముగిసింది.
అంతేకాదు.. నవదీప్ సైనీ వేసిన మరుసటి ఓవర్‌లో రోస్టన్ ఛేజ్(38)ని కూడా బౌల్డ్ చేయడంతో విండీస్ కష్టాల్లో పడింది. వెంటవెంటనే సైనీ రెండు వికెట్లు సాధించి మంచి బ్రేక్ ఇవ్వడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టుబిగించింది.
ఇదిలావుంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు లూయిస్, హోప్‌లు విండీస్ ఇన్నింగ్సును ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల జత చేశారు. ఆ తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం నవదీప్ విజృబించడంతో మిగతా రెండు వికెట్లు పడ్డాయి. విండీస్ 50 ఓవర్లకు 315/5 భారీస్కోరు చేసింది. పోలార్డ్ (74) 7 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా.. పూరన్ (89) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంది.