వెస్టిండీస్‌తో జరుగుతున్న‌ మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మార్పు మిన‌హా రెండో వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే టీమిండియా బ‌రిలోకి దిగుతుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న దీపక్ చాహర్ స్థానంలో నవదీప్ సైనీకి ఈ వ‌న్డేలో చోటు క‌ల్పించారు. నవదీప్‌కిది తొలి అంతర్జాతీయ వన్డే.

ప్ర‌స్తుత సిరీస్‌లో విండీస్‌తో 1-1తో సమంగా ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌నే ఊపు మీదుంది. అలాగే విండీస్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా సిరీస్‌తో ప‌య‌న‌మ‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.