రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే రైల్వే స్టేషన్‌.. ఎక్కడంటే

By సుభాష్  Published on  6 July 2020 9:38 AM GMT
రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే రైల్వే స్టేషన్‌.. ఎక్కడంటే

కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఆ పోస్టును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతిపెద్ద వ్యవస్థ అయిన రైల్వే శాఖ గురించి ఓ వింత విషయాన్ని మంత్రి పీయూష్‌ గోపాల్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆయన పెట్టిన పోస్టుకు లైకులు, షేర్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 Navapur Railway Station

భారత్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఆ రైల్వే స్టేషన్‌ సాధారణమైనది కాదు. రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న ఒకే రైల్వే స్టేషన్‌ అది. మహారాష్ట్ర సరిహద్దులోని నందూర్బార్ జిల్లా నవాపూర్ రైల్వేస్టేషన్. దీనిని గుజరాత్, మహారాష్ట్ర చెరోసగం పంచుకుంటున్నాయి. దీని తాలుకు ఫోటోను రైల్వేశాఖ మంత్రి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సూరత్‌-భుసవల్‌ మార్గంలో నవాపూర్‌ రైల్వేషన్‌ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈస్టేషన్‌ మధ్య నుంచి వెళ్తున్నాయి. ఈ స్టేషన్‌ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. ఇలా స్టేషన్‌ మధ్యలో నిలబడితే ఒక అడుగు ముందుకేస్తే గుజరాత్‌లోకి ఒక వెనక్కి వేస్తే మహారాష్ట్రలో ఉంటామన్నమాట. ఇలాంటిది మరో భవానీ మండి రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఇది కూడా మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉందని మంత్రి పేర్కొన్నారు.



Next Story