ముఖ్యాంశాలు

  • బీహార్, ఒడిషా రాష్ట్రాల్లో ఎన్‌పీఆర్‌ తయారీలో ఇబ్బందులు
  • తల్లిదండ్రుల పుట్టిన తేదీ, ప్రదేశం కనుక్కోవడం కష్టమని స్పష్టీకరణ
  • స్వయంగా దీని గురించి వెల్లడించిన బీహార్ సీఎం నితిష్ కుమార్
  • ఒడిషాదీ ఇదే బాట అంటున్న ప్రభుత్వ అధికార ప్రతినిధి
  • కాలమ్ 13(2) ఆప్షనల్ అంటున్న రాష్ట్రాలు
  • ఆ కాలమ్ నింపాలని పనిలేదని స్పష్టీకరణ

ఎన్‌పీఆర్‌ తయారీ విషయంలో రాష్ట్రాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పౌరుల వివరాలను సేకరించేటప్పుడు వారి తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశం, పుట్టిన రోజు వివరాలను సేకరించడం చాలా కష్టంగా ఉందని సదరు రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. పాత కాలంలో ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పుట్టారో పెద్దగా రాసిపెట్టుకునే అలవాటు, గుర్తు పెట్టుకునే అలవాటు ఎవరికీ లేదనీ, దానివల్ల ఆ వివరాలు సేకరించడం కష్టమనీ అంటున్నాయి.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారీలో వ్యక్తుల తల్లిదండ్రుల పుట్టిన రోజులు, పుట్టిన ప్రదేశాలను సేకరించడం వీలుకాదని బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ స్పష్టం చేశారు. ఆ వివరాలు లేకుండానే రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ రికార్డులు నమోదవుతాయని ఆయన తేల్చి చెప్పారు.

సి.ఎ.ఎ అమలవుతున్నందున మళ్లీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎన్.సి.ఆర్ అవసరం లేదనీ, దీనికి సంబంధించిన నిర్ణయం సుప్రీంకోర్టు చేతుల్లో ఉన్నందున ఇంతకు మించి దీని గురించి మాట్లాడేందుకు ఇష్టపడట్లేదని నితిష్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు ఎన్‌పీఆర్‌ తయారీ విషయంలో కొన్ని ఇబ్బందులు సబ్బందులు ఉన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు.

ఒడిషాలో అధికారంలో ఉన్న బిజూజనతాదళ్ కూడా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం తల్లిదండ్రుల పుట్టిన తేదీలు, పుట్టిన రోజులు సేకరించడం వీలుకాదని తేల్చిచెప్పింది. కేంద్రం విడుదల చేసిన పత్రాల్లో కాలమ్ 13(2) ఆప్షనల్ అని ఉన్నందున అది ఒడిషాలో అప్లైకాదన్న అభిప్రాయంతో ఆ వివరాలను సేకరించడం లేదని బిజెడి అధికార ప్రతినిధి పినాకీ మిశ్రా తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.