ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై బీజేపీ వేటు..!

By అంజి  Published on  28 Nov 2019 8:39 AM GMT
ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై బీజేపీ వేటు..!

ఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిన్న లోక్‌సభలో చేసిన కామెంట్స్‌ను ఆ పార్టీ ఖండించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, ఆమె వ్యాఖ్యలను బీజేపీ సపోర్ట్ చేయదని బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా ప్రకటించారు.. ఈ రకమైన ఐడియాలజీకి తాము వ్యతిరేకమన్నారు. ప్రజ్ఞాసింగ్‌ కామెంట్స్‌ను తప్పుపడుతూ ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు జేపీ నడ్డా తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు ఆమెను అనుమతించబోమన్నారు.

Pragya Pti 380

అలాగే డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా ఆమె నియామకాన్ని కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించారు. లోక్సభలో నిన్న ఎస్పీజీ సవరణ బిల్లు పై చర్చ సందర్భంగా గాంధీ ని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది అనే ప్రస్తావన వచ్చింది. డీఎంకే ఎంపీ రాజా ఈ ప్రశ్న లేవనెత్తగానే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందిస్తూ గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించారు. వెనువెంటనే సభలో ప్రతిపక్షాలు ముక్తకంఠంతో నిరసన తెలిపాయి. ప్రజ్ఞ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలోనూ గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచారు.



Next Story