మహారాష్ట్రలో జాయితీస్థాయిలో ఉన్న బాక్సర్‌ పవన్‌ రౌత్‌ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్‌ గదిలో పవన్‌ రౌత్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కోచ్‌ సతీష్‌ చంద్ర భట్‌ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లో పవన్‌ మహారాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించినట్లు చెప్పారు. నాగర్‌పూర్‌కు చెందిన పవన్‌ అకోలాలోని స్పోర్స్ట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. కాగా, శుక్రవారం అకోలాలో జరిగే ఓ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉండగా, ఇలా బలన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై క్రీడా మంత్రి సునీల్‌ కేదార్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.